మౌనంగా వున్న సాహిత్యం - నూతన మోహన్, డింకర్
| గాయకుడు | నూతన మోహన్, డింకర్ |
| స్వరకర్త | మణి శర్మ |
| సంగీతం | మణి శర్మ |
| పాటల రచయిత | సిరివెన్నెల సీతారామ శాస్త్రి |
సాహిత్యం
మౌనంగా ఉన్నా నీతో అంటున్నా
నా వెంట నిన్ను రారమ్మని
తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా కడపొద్దంటున్నా లేలెమ్మనీ
వినలేదా కాస్తయినా నీ ఎడసడిలోనే లేనా
వెతకాల ఏమైనా నిను నాలోనే చూస్తున్నా
ఒక్కటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన
లోలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతియ్యని ఊహకు ఒడిలో ఊయల వేసి
నీ పేరుతో కొత్తగా పుట్టనీ నా జీవితం ఇప్పుడే మొదలనీ
ఒక్కటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఎవరూ మన జాడని చూడని చోటే కనిపెడదమా
ఎపుడూ మనమిద్దరికీ కనబడుదామా
నా పెదవిలో నవ్వుల చేరిపో నా ఊపిరే నువ్వులా మారిపో
ఒక్కటే బ్రతుకు మన ఇద్దరికి ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన..