Labels

Labels

Gundellona Gundelloana song lyrics | Ori Devuda

గాయకుడు అనిరుధ్ రవిచందర్
స్వరకర్త లియోన్ జేమ్స్
సంగీతం లియోన్ జేమ్స్
పాటల రచయితకాసర్ల శ్యామ్

సాహిత్యం

Gundellona Gundelloana


ఏ' ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే

బుజ్జమ్మా బుజ్జమ్మ

ఏ' మరువనే మరువనే కలల్లోనూ నిన్నే

బుజ్జమ్మా బుజ్జమ్మ

గొడవలే పడనులే నీతో

గొడుగులా నీడౌతానే

అడుగులు వేస్తానమ్మా నీతో

అరచేతుల్లో మోస్తూనే


గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి

గూడే కట్టి గువ్వలెక్క చూస్తానే

గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి

పైనోడితో అనుమతి నే తెచ్చుకుంటానే


ఏ' గడవనే గడవదే నువ్వేలేని రోజే

బుజ్జమ్మా బుజ్జమ్మ

ఏ' ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే

బుజ్జమ్మా బుజ్జమ్మా

నా చిన్ని బుజ్జమ్మా

నాకన్నీ బుజ్జమ్మా


కరిగిన కాలం తిరిగి తెస్తానే

నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మ

మిగిలిన కథనే కలిపి రాస్తానే

మనకిక దూరం ఉండొద్దే బుజ్జమ్మా

మనసులో తలిచినా చాలే

చిటికెలో నీకే ఎదురౌతానే

కనులతో అడిగి చూస్తే

ఎంతో సంతోషం నింపేస్తానే ఏ ఏ ఏ ఏ


గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి

గూడే కట్టి గువ్వలెక్క చూస్తానే

గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి

పైనోడితో అనుమతి నే తెచ్చుకుంటానే

గుండెలోన గుండెలోన కొత్తరంగే నింపుకున్నా


గుండెలోన గుండెలోన బొమ్మ నీదే గీసుకున్నా

ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే

బుజ్జమ్మా బుజ్జమ్మ


గుండెల్లోన వీడియో చూడండి






Search This Blog

Latest Post

Categories